ప్చ్.. రాకేశ్ మాస్టర్ ముందే చెప్పాడు

44
- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, తాను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో రాకేశ్ మాస్టర్ ముందే చెప్పాడు. తన మరణం తర్వాత శేఖర్‌, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారని, వారికి బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుందని, ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారని రాకేశ్ మాస్టర్ కామెంట్స్ చేశారు. ఎప్పుడెప్పుడు తన డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి తాము ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా ? అని వారు ఉంటారన్నారని రాకేశ్ మాస్టర్ అన్నారు.

ఐతే, ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువు మరణ వార్త తెలియగానే సోమవారం నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని చూసి శేఖర్ కన్నీరు పెట్టారు. అనంతరం ఆయన పార్థివదేహానికి నమస్కారం చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ మరో శిష్యుడైన జానీ మాస్టర్ కూడా ఆయన కడసారి చూపు కోసం వెళ్లి ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి రాకేశ్ మాస్టర్ చెప్పిన విధంగానే ఆయన శిష్యులు వచ్చి ఆయన పార్థివదేహాన్నీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో వీరి విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Kollywood:ఆ స్టార్లకు రెడ్ కార్డ్‌ జారీ..!

ఇంతకీ రాకేశ్ మాస్టర్‌కు జీవితంపై విరక్తి.. ఎందుకంటే ? తన అనుకున్న వారంతా చనిపోవడంతో జీవితంపై విరక్తి కలిగిందని రాకేశ్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. తను చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. తర్వాత, అమ్మ చనిపోయింది. అక్క కొడుకు చనిపోయాడు. నాన్న చనిపోయాడు. నాకు చావంటే భయం లేదు కానీ, ఈ ఘటనల వల్ల ఫోన్‌ కాల్‌ వస్తే భయపడిపోయేవాణ్ని’అంటూ రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Also Read: ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -