అడివి శేష్ మంచి నటుడు, పైగా సత్తా ఉన్న దర్శకుడు.. అంతకు మించి కంటెంట్ ఉన్న స్క్రీన్ ప్లే రైటర్. పైగా సక్సెస్ లో ఉన్నాడు. అన్నిటికి మించి అడివి శేష్ కి సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. అందుకే, నిర్మాతలు ప్రస్తుతం అడివి శేష్ డేట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ మార్కెట్ కి మించి ఖర్చు పెడతాం, డేట్స్ ఇవ్వండి అంటే.. నో అంటున్నాడు. పోనీ మీకు నచ్చే కథలను పట్టుకొస్తాం, సినిమా చేస్తా అని మాట ఇవ్వండి అన్నా.. నో అంటున్నాడు. పైగా నాకు కథలు అక్కర్లేదు అంటున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడితో వస్తే చాలు అని నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.
ఇదేంటి ?, కథ లేకుండా దర్శకుడితో రమ్మంటున్నాడు. వరుస హిట్లు కొడితే మాత్రం.. మరీ ఇంత టెక్కు పనికిరాదు. ఇది నిర్మాతల వెర్షన్. అసలు ఏం జరుగుతుంది ?, అడవి శేష్ ఎందుకు కథలు వద్దు అంటున్నాడు అంటే.. తన దగ్గరే బోలెడన్ని కథలు ఉన్నాయట. వాటితో సినిమాలు తీసుకొంటానని అడవి శేష్ నిర్మాతలకు చెబుతున్నాడట. అడవి శేష్ లో ఈ టాలెంట్ కూడా ఉంది. స్క్రిప్టులో తనకు అంటూ ఓ బలమైన హ్యాండు ఉంది. ఇది రుజువు అయ్యింది కూడా.
తానూ రాసిన కథలు హిట్టయ్యాయి కదా? అందుకనే ఓ టీమ్ ని పెట్టుకొని వాళ్లతో కథలు రెడీ చేయిస్తున్నాడట. అందుకే ఎవరైనా కథ చెబుతానంటే.. `నా దగ్గరే బోలెడు కథలున్నాయి.. మంచి దర్శకుడిని ఇస్తే చాలు` అంటున్నాడు అడవి శేష్. మరి అడవి శేష్ దగ్గర ఎలాంటి కథలు ఉన్నాయో.. ?, ఇంతకీ సగటు కమర్షియల్ దర్శకుడు అడవి శేష్ లాంటి హీరో దగ్గర స్వేచ్ఛగా పని చేయగలడా ?. ఏమిటో.. ఒక్కోసారి టాలెంట్ ఎక్కువైనా ఇబ్బందే.
ఇవి కూడా చదవండి…