పాయల్ ‘మంగళవారం’ ముచ్చట్లు

48
- Advertisement -

దర్శకుడు అజయ్ భూపతి తీసిన మూడో చిత్రం ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఇండియాలో ఎవరూ చెయ్యని పాత్ర చేసిందట. మీడియాతో తాజాగా పాయల్ ఈ సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ఆ ముచ్చట్లు ఏమిటో పాయల్ మాటల్లోనే విందాం. ‘నేను తెలుగులో నటించిన మొదటి సినిమా దర్శకుడు అజయ్ భూపతే నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఇందులో నా పాత్ర కోసం పల్లెటూరి స్లాంగ్ కూడా నేర్చుకున్నా. అలాగే యాసలోనే డైలాగ్ లు చెప్పాను.

‘నా గెటప్ కోసం మా డైరెక్టర్ గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఇప్పటికే మా సినిమాకు మంచి బజ్ వచ్చింది’ అని పాయల్ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. స్లో అండ్ స్టడీ అంటుంది. నచ్చింది చేసుకుంటూ పోవాలి. వచ్చింది చెయ్యాలి. విజయాలు వాటంతట అవే వస్తాయి. నెగిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికే కొన్ని బోల్డ్ సిరీస్ లు నా దగ్గరకు వచ్చాయి. ఆ స్క్రిప్ట్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అందుకే, ఆ సిరీస్ లు చేయాలని నిర్ణయించుకున్నా’ అని పాయల్ చెప్పుకొచ్చింది.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేస్తోంది కాబట్టి, ఆమెకు మంచి బ్రేక్ వస్తోంది అని భావిస్తున్నారు. ఈ రోజు నైటే మంగళవారం ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.

Also Read:జామ ఆకులతో ఉపయోగాలు తెలుసా!

- Advertisement -