పవన్ వారసుడు ఎంట్రీకి సిద్ధం

98
- Advertisement -

పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు ఆశ పడుతున్నారు. అయితే, అకిరా నందన్ కి యాక్టింగ్ పై ఇంట్రస్ట్ లేదని టాక్ నడిచింది. కానీ సడెన్ గా అకిరా నందన్ లో మార్పు వచ్చింది. అందుకే, ప్రస్తుతం తన ఫిజిక్ పై అకిరా నందన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మారిన ఆలోచన విధానం కావొచ్చు, పవన్ సన్నిహితుల ఒత్తిడి కావొచ్చు.. మొత్తానికి అకిరా నందన్ తన లుక్ ను హీరోలాగా మార్చడానికి ఇంకా కసరత్తులు పెంచుతున్నాడు.

మరో రెండు నెలల్లో అకిరా నందన్ పూర్తి స్లిమ్ గా సిక్స్ ప్యాక్ బాడీతో ఓ ఫోటో షూట్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నాడట. ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతారు. గత కొన్ని నెలలుగా మా యంగ్ హీరో ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలక్షేపం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ వార్త గొప్ప శుభవార్తే. ఎంతైనా పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి,

ఇక పవన్ కళ్యాణ్ డైలాగ్ లకు థియేటర్స్ డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయ్. అలాంటి పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం మరి ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఎదురుచూడటంలో ఆశ్చర్యం ఏముంది ?. పైగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకులు కొందరు ఈ మధ్య అకిరా నందన్ తో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మరి వచ్చే ఏడాది అకిరా నందన్ తొలి చిత్రం ఉంటుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

క్రిస్మస్‌ కానుకగా మేరీ క్రిస్టమస్ పోస్టర్‌

చివరి కోరిక తీరకుండానే నింగికేగాడు !

షాకింగ్‌… సినిమాలకు అనుపమ గుడ్‌ బై

- Advertisement -