మెగా ప్రీ రిలీజ్‌కు పవన్‌ రాలేదు..

179
Pawan Against Khaidi Pre-Release Function
- Advertisement -

దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. ఇవాళ సాయంత్రం గుంటూరులోని హాయ్ ల్యాండ్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఫంక్షన్‌కు మెగా హీరోలంతా హాజరుకానున్నారు. కానీ ఈ వేడుకకు చిరంజీవి తమ్ముడు  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ హాజరుకాలేదు. పవన్  కోసం ఎదురుచూసిన మెగా అభిమానులకు నిరాశ తప్పలేదు.

అంతకుముందు ఈ సినిమా గురించి స్పందించిన ట్విట్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ స్పందించిన సంగతి తెలిసిందే. చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు’ ఆయన అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆయన తప్పకుండా ఈ వేడుకలో హాజరవుతారని మెగా ఫ్యాన్స్‌లో ప్రచారం జరిగింది.

పవన్‌ రాకపోయినా ఆయన తరఫున ’కాటమరాయుడు’ నిర్మాత శరత్‌ మరార్‌ ఈ వేడుక వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తరఫున చిరంజీవికి, ఖైదీ నెంబర్‌ 150 చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు పంపించారు. ఈ సినిమా ఘనవిజయం కావాలని పవన్‌ కల్యాణ్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరత్‌ మరార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు ఎత్తగానే ఈ సభాప్రాంగణం మెగాఫ్యాన్స్‌ కెరింతలతో మార్మోగింది. మరోవైపు ఈ వేడుకకు రాకపోవడంతో ఆయన ఎందుకు రాలేదు అనే కోణంలో అభిమానుల్లో చర్చ నడిచింది.

- Advertisement -