మానవత్వమా నువ్వెక్కడా…?

221
Another death walk in Odisha
- Advertisement -

ఓ వ్యక్తి తన భుజాలపై ఓ శవాన్ని మోసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. అందరి అతన్ని వింతగా చూశారు. వివరాలపై ఆరా తీస్తే నిర్ఘాంతపోయే విషయం వెలుగుచూసింది. ఒడిశాలోఅనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన తన భార్యను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి డబ్బులు లేక.. మంజీ అనే వ్యక్తి భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌నను మీడియా ద్వారా తెలుసుకున్న బ‌హ్రెయిన్ ప్ర‌ధాన‌మంత్రి ప్రిన్స్ ఖ‌లీఫా తీవ్రమైన వ్య‌థ‌కు లోన‌య్యారు. మాంజీ కుటుంబానికి 9 లక్షల సాయం అందించాడు.ఇలాంటి ఘటనలు పునరావృతి కాకుడదని అందరు కోరుకున్నారు. ఈ సంఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే ఒడిశాలోనే మరో హృదయవిదారక వార్త వెలుగుచూసింది.

Another death walk in Odisha

వివరాల్లోకి వెళ్తె…తీవ్ర జ్వరంతో బాధపడున్న తన కూతురు సుమి ధిబర్ ను.. పల్లాహర్ హాస్పిటల్ జాయిన్ చేశాడు ఆమె తండ్రి గటి దిబర్. ట్రీట్ మెంట్ కొనసాగుతుండగానే సుమి ధిబర్ చనిపోయింది. ఈ విషయాన్ని గటి ధిబర్ కు తెలిపారు డాక్టర్లు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయాడు గటి ధిబర్. కూతురు శవాన్ని సొంత గ్రామానికి చేరవేయడానికి డబ్బులు లేకపోవటంతో దిక్కుతోచని స్ధితిలోచివరకు బరువెక్కిన హృదయంతో తన కూతురు శవాన్ని భుజంపై ఎత్తుకుని బయలు దేరాడు ఆ తండ్రి. ఏకంగా 15 కిలో మీటర్ల దూరంలోని తన గ్రామానికి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని మోసుకెళ్లాడు. ఒడిశాలోని అంగల్ జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది.

భుజంపై కూతురి శవంతో.. ఊర్లు దాటుకుంటూ వెళుతున్నా.. అయ్యోపాపం అన్నోళ్లే కానీ.. ముందుకొచ్చి ఆదుకున్న పుణ్యాత్ముడు మాత్రం కనిపించలేదు. మూడు ఊర్లు దాటినా.. దయగల హృదయం లేకపోవటం విడ్డూరం. చివరకు తన సొంతూరుకు చేరుకున్న ధిబర్‌…అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గటి ధిబర్ తన కూతురి శవాన్ని భుజంపై ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందించారు.

Another death walk in Odisha

అంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనిపై స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డు, హాస్పిటల్ మేనేజర్ సస్పెండ్ చేశారు. సంబంధిత అధికారులను వివరణ కోరినట్లు తెలిపారు. తుది రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

మరో విషయం ఏంటంటే.ఒరిస్సాలో ఓ పథకాన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం, అంతే కాదు ఆ పథకం గురించి చాలా సందర్భాల్లో గొప్పలు కూడా చెప్పుకుంది ..ఆ పథకం పేరు మహాప్రయాణ పథకం.దీని ప్రకారం చనిపోయిన వ్యక్తులను వారి వారి స్వస్థలాలకు ఉచితంగా చేర్చుతారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో మహా ప్రయాణ పథకం నాడు మాంజీ కుటుంబాన్ని…నేడు గటి ధిబర్ కుటుంబాన్ని ఏ మాత్రం ఆదుకోలేకపోయింది.

- Advertisement -