ఖైదీ పాటలు వింటున్న బాలయ్య..

191
Balaiah Enjoying Khaidi No 150 Songs
- Advertisement -

టాలీవుడ్‌ సంక్రాంతి సమరానికి అగ్ర హీరోలు రెడీ అయ్యారు. 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా….నందమూరి నటసింహం తన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఈ నెల 12న గర్జించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి వార్‌లో పైచేయి ఎవరిదనే దానిపై మెగా,నందమూరి ఫ్యాన్స్‌ మధ్య రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఏపీ డీజీపీ….హద్దు మీరితే తాటతీస్తామని హెచ్చరించారు. దీనిని బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు పరిస్ధితి ఏలా ఉందో.

అభిమానుల మధ్య సంక్రాంతి వార్ నడుస్తుంటే….ఈ ఇద్దరు అగ్రహీరోలు మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి పోటీ లేదని… ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్లు కావాలనే ధోరణిలో ఉన్నారు. బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అంతేగాదు సినిమా స్పెషల్‌…సీఎం కేసీఆర్‌తో కలిసి చూస్తానని చెప్పారు.

ఇక బాలయ్య సైతం చిరు బాటలోనే పయనిస్తున్నాడు. ‘ఖైదీ నెం 150’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నీ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు భిన్నంగా తాజాగా రిలీజైన ‘నీరు నీరు నీరు… రైతు కంట నీరు’ అంటూ సాంగే సాంగ్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. రైతుల కష్టాలను వర్ణిస్తూ సాంగే ఈ పాట ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

బసవతారకరామ పుత్ర బాలయ్య సైతం తన కారులో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా పాటలను వింటున్నారట. ముఖ్యంగా ‘నీరు నీరు నీరు’ అనే పాటను ప్రత్యేకంగా వింటున్నారట. అభిమానులు కూడా వీరిద్దరినీ ఫాలో అయితే… ఏ సమస్యా ఉండదు. మొత్తంగా రెండు పెద్ద సినిమాలు విడుదలకు ముందు ఈ అగ్రహీరోలు ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకోవటం శుభపరిణామామే.

- Advertisement -