జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో-1 ను నిరసిస్తూ.. ఈ ఇద్దరు అధినేతలు సమావేశం కాగా.. ఏపీ పాలిటిక్స్ లో ఈ ఇద్దరి కలయిక రకరకాల డిబేట్లకు కారణం అవుతోంది. రెండు పార్టీల పొత్తుకు సంకేతమే ఈ కలయిక అని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే.. కాదు కాదు వైసీపీ అరాచకాలపైనే తమ చర్చ జరిగిందని పవన్, చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఏపీలో గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన పార్టీల మద్య పొత్తుకు సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే పొత్తు విషయంలో అటు చంద్రబాబు గాని ఇటు పవన్ గాని ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికి ఇరు పార్టీల అధినేతలు అప్పుడప్పుడు భేటీ అవుతుండడంతో పొత్తు కన్ఫర్మ్ అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్, బాబు కలయికపై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సంక్రాంతి మాముళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుదు వెళ్లడాని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శిస్తే.. కాపు సోదరులరా పవన్ను నమ్మి మోసపోకండి.. బాబు పల్లకి మోయకండి అంటూ మరో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
ఇలా అధికార పార్టీ నేతలు పవన్ బాబు కలయికపై ఘాటు విమర్శలు చేస్తుంటే.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. ” కేవలం డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మలకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కాంగ్రాట్యులేషన్ కమ్మోళ్ళు ” అంటూ పవన్ పై పరోక్షంగా సెటైర్లు కురిపించారు ఆర్జీవి. అయితే ఆర్జీవి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. కాగా ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు కమ్మా, కాపుల మద్య కుల చిచ్చు రేపెట్టే విధంగా ఉండడంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…