సభ్యసమాజం తలదించుకునేలా గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటనపై ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ దాచేపల్లి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డపైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని పవన్ ఆవేదనతో వవన్ ట్వీటీ చేశారు.
దాచేపల్లి ఘటన తన మనసుని కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అత్యాచార ఘటనల వార్త విన్నప్పుడల్లా తనతో పాటు పౌర సమాజం తీవ్ర వేదనకి గురవుతోందని ట్వీట్ చేశారు.
దాచేపల్లిలోషేక్ అఫిపాభాను అనే 9 సంవత్సరాల చిన్నారిపై అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై లైంగిక దాడికి నిరసిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతివ్వడంతో ఆందోళన ఉదృత రూపం దాల్చింది. నిందితుడి ఇంటిని కూల్చివేసిన బాధితురాలి తరపు బంధువులు రోడ్లపై టైర్లు కాల్చివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు. ఘటనను నిరసిస్తూ దాచేపల్లిలో స్థానికులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు.
Dachepalli Incident pic.twitter.com/7r7i1VsPd8
— Pawan Kalyan (@PawanKalyan) May 3, 2018