జీవితంలో నా పర్పస్ ఒక్కటే..

228
Vijay deverakonda talking about on laughing
- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం విజయ్ స్టార్‌డమ్ అమాంతంగ పెరిగిపోయింది.

Vijay deverakonda talking about on laughing

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విజయ్ టాక్సివాలా సినిమాలోనటిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఎవడే సుబ్రహ్మాణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, సమంతా, విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇక విషయానికొస్తే..తాజాగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయన్ని పంచుకున్నాడు విజయ్. ‘మహానటి’ చిత్రంలో సమంతా, విజయ్ నవ్వుతూ ఉన్న ఫోటోను పోస్టు చేస్తూ ఓ కామెంట్‌ను కూడా పెట్టాడు. ‘జీవితంలో నా పర్పస్ ఒక్కటే… నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’ అని ట్విట్ చేశాడు. దీనికి విజయ్ అభిమానుల నుంచి కామెంట్స్ వెల్లువగా పెడుతున్నారు.

- Advertisement -