బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే కేసు పెడతారా..? అని ప్రశ్నించారు ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్. తనపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు.హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ యాడ్స్ కు రూ.300 కోట్లు లంచం తీసుకున్నారని డీజీపీ, మాజీ సీఎస్ పై అన్వేష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అన్వేష్ ఆరోపణలను ఖండిస్తూ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు . తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేశారు అన్వేష్. రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు పోలీసులు.
కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తూ వస్తున్నారు అన్వేష్. ఆధారాలను బయటపెడుతూ సెలబ్రెటీల బండారాన్ని బయటపెడుతున్నారు.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

