పవన్ మౌనం.. దేనికి సంకేతం ?

21
- Advertisement -

పవన్ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఎప్పుడు చురుకైన మాటలతో అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసే జనసేనాని మౌనంగా ఉండడం ఏంటని ? అందరిలోనూ ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తూ.. పోలిటికల్ పరంగా ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు. శ్రీకాకులం లో జరిగిన యువశక్తి బహిరంగ సభ తరువాత పెద్దగా పాలిటిక్స్ లో స్పందించలేదు. మరోవైపు వైసీపీ నుంచి పవన్ వైఖరి పై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికి కూడా నోరు మెదపడం లేదు. ఇటీవల పవన్ కు మరియు కే‌సి‌ఆర్ కు మద్య వెయ్యి కోట్ల డీల్ కుదిరిందనే పోలిటికల్ రూమర్స్ వస్తున్నప్పటికి పవన్ మాత్రం సైలెన్స్ వీడడం లేదు.

దీంతో పవన్ మౌననికి కారణం ఎంటనే చర్చ జోరందుకుంది. అయితే పవన్ మౌననికి కారణం ఉందనేది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, ఇక ఇటీవల ప్రారంభం అయిన వినోదయ సీతాం రీమేక్, ప్రస్తుతం ఈ మూవీస్ యొక్క షూటింగ్స్ ను కంప్లీట్ చేసే పనిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉగాది నుంచి పవన్ బస్సు యాత్ర మొదలు పెడతారని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. దాంతో ఒక్కసారి యాత్ర ప్రారంభిస్తే బ్రేక్ ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారట.

అందుకే ఒప్పుకున్న సినిమాలను ముందు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట పవన్. అందుకే రాజకీయంగా ప్రస్తుతం పవన్ ఇన్ యాక్టివ్ గా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పవన్ బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ మద్య వారాహిని పరిచయం చేసి కొంత హడావిడి చేసినప్పటికీ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. మరోవైపు పవన్ బస్సు యాత్ర కోసం ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లోకేశ్ పాదయాత్ర కోసమే పవన్ బస్సు యాత్రను వాయిదా వేసుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వీటన్నిటికి సమాధానంగా పవన్ ఎప్పుడు మౌనం విడుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

వచ్చే ఎన్నికల్లో యుద్దమే !

రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కేంద్రాలు

- Advertisement -