పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

19
- Advertisement -

ఏపీలో జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసే స్థానాలపై మొదటి నుంచి కూడా ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికి గెలుపే లక్ష్యంగా ఈసారి ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు లోకేష్. ఈసారి తప్పకుండా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. అటు పవన్ విషయానికొస్తే ఆయన పోటీ చేసే స్థానంపై మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు పవన్. దీంతో వీరిద్దరికి పోటీగా వైసీపీ తరుపున ఎవరు నిలుస్తారనే చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో వీరిద్దరిపై పోటీ చేసేదేవరనే దానిపై క్లారిటీ వచ్చింది. .

మంగళ గిరిలో లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య, పిఠాపురం నుంచి పవన్ కు పోటీగా వంగా గీత లకు సీట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఎవరు ఊహించని విధంగా పవన్ లోకేష్ లపై పోటీగా మహిళలకు నిలబెట్టడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణ రెడ్డి విజయం సాచిందారు. ఇటీవల ఆర్కే పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికి నెల తిరగకుండానే మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు., అయితే లోకేష్ కు పోటీగా ఆళ్ళ లేదా గంజి చిరంజీవిని నిలబెట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

కానీ వ్యూహాత్మకంగా మురుగుడు లావణ్యకు సీటు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇక గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చవిచూసిన పవన్ ఈసారి వ్యూహాత్మకంగా కాపు ఓటుబ్యాంకును టార్గెట్ చేస్తూ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. మరోసారి పవన్ ను ఓడించేందుకు పిఠాపురం నుంచి ముద్రగడను వైసీపీ తరుపున బరిలో దించే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఊహించని రీతిలో వంగా గీతను పోటీలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో పవన్, లోకేష్ లకు పోటీగా నిలిచిన మహిళలు ఏ మాత్రం గెలిచిన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:ఏఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే?

- Advertisement -