కడపలో అవినాష్ రెడ్డి vs షర్మిల?

10
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికలపై తలమునకలయ్యాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుండగా తాజాగా అధికార వైసీపీ కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించింది. అందులో భాగంగానే తాజాగా లోక్ సభ అభ్యర్థుల జాబితా ను విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 25 ఎంపీ స్థానాలకు గాను బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం వైసీపీ ప్రకటించిన లోక్ సభ స్థానాల్లో అందరి దృష్టి కూడా కడప సీటుపై పడింది.

ఇక్కడ మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు సీబీఐ విచారణ కూడా ఎదుర్కున్నాడు. ఈ కేసు కారణంగా ఈసారి ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి సీటు దక్కడం కష్టమే అని భావించారంతా. కానీ ఎవరు ఊహించని రీతిలో కడప ఎంపీ సీటును మళ్ళీ అవినాష్ రెడ్డికే అప్పగించారు వైఎస్ జగన్.

దీంతో ఈ అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది. ఇకపోతే కడప ఎంపీ స్థానంపై కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వివేకానంద రెడ్డి వర్థంతి సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తనను కడప ఎంపీగా చిన్నన్న చూడాలనుకున్నారని ఆమె చెప్పుకొచ్చిన సంగతి విధితమే. దీంతో ఆమె కడప ఎంపీ సీటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. ఒకవేళ నిజంగానే ఆమె కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తే అవినాష్ రెడ్డికి మాత్రమే కాకుండా టోటల్ వైసీపీకే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరి షర్మిల నిజంగానే కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా ? లేదా సొంత అన్న జగన్ పై పులివెందుల అసెంబ్లీ సీటుపై పోటీ చేస్తారా అనేది చూడాలి.

Also Read:ఏఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే?

- Advertisement -