జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుల రాజకీయం మొదలు పెట్టారా? కుల సమీకరణల విషయంలో పవన్ రూటు మార్చరా ? కులాల విషయంలో పవన్ వైఖరి మారుతోందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జనసేన 10 వ ఆవిర్భావ సభలో పవన్ ఎక్కువగా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. కులమతాలకు అతీతంగా జనసేన పని చేస్తుందని పవన్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం పవన్ వైఖరి చూస్తుంటే కుల సమీకరణల విషయంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన్నట్లు తెలుస్తోంది.
తను ఏ ఒక్క కులాన్నో గద్దెనెక్కించదనికి రాలేదన్నా పవన్.. గత ఎన్నికల్లో తనకు అండగా నిలుస్తుందని భావించిన కులామే తనకు మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అన్నీ కులాలను కలపడమే తమ అభిమతం అని చెప్పిన పవన్.. ముఖ్యంగా బీసీ, కాపు కులాలు కలవాలని సూచించారు.. కుల ఉచ్చులోనుంచి బయటకు రావాలని చెప్పిన పవన్.. అన్నీ కులాలు కలిసి జనసేనకు మద్దతు పలకాలని చెప్పుకొచ్చారు. ఈ విధంగా పవన్ కుల సమీకరణల విషయంలో రెండు విధాలుగా చెప్పడం పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు తావిస్తోంది.
గతంలో కులాల విషయంలో ఆచితూచి మాట్లాడే పవన్.. ఇప్పుడు పదే పదే కుల ప్రస్తావనను తీసుకొస్తున్నారు. దీంతో అసలు పవన్ వ్యూహామెంటి అనేది ఆసక్తికరంగా మారింది. తాను ఏ ఒక్క కులాన్నో గద్దెనెక్కించదనికి రాలేదని చెప్పిన పవన్.. కాపుల అండ ఎందుకు కోరుకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఏ రాజకీయ పార్టీకైనా కుల సమీకరణలు ఎంతో కీలకం. ఎందుకంటే ఆయా కులాల వారీగా బలమైన అభ్యర్థుల ద్వారా పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పవన్ కూడా కులాల వారీగా బలమైన అభ్యర్థులను రేస్ లో నిలుపుతూనే.. కుల రాజకీయాలు చేయనని చెబుతున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు కాస్త కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. అయితే కులాల కుంపటి నుంచి బయటపడి అందరు ఏకం కావలనేదే పవన్ విధానమని జనసేన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. మరి పవన్ కోరుకుంటున్నట్లుగా అన్నీ కులాలు ఏకమై జనసేనకు మద్దతు పలుకుతాయా ? అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి పవన్ చేస్తున్న కులరాజకీయం కొంత చర్చనీయాంశమే.
ఇవి కూడా చదవండి…