అదరగొట్టిన… కాటమరాయుడు

303
Pawan Katamarayudu New Year Special
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాటమరాయుడు. ఇప్పటి వరకు మూడు లుక్స్ విడుదల చేసిన కూడా ఒక్క పోస్టర్ లోను పవన్ ని పూర్తి గా చూపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.అయితే నూతన సంవత్సరం సందర్భంగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. లుక్ లో పవన్ ఫ్రేమ్ పూర్తిగా కనిపించడంతో పవన్‌ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. పోస్టర్‌లోనే ఇంత బాగుంటే సినిమాలో పవర్‌స్టార్‌ ఇక ఎంత డిఫరెంట్‌ ఉంటాడో అని పవన్‌ అభిమానులు అనుకుంటున్నారు.

Pawan Katamarayudu New Year Special

ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం తమిళ మూవీ వీరమ్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈసినిమాలో శివబాలాజీ, అజయ్‌,కమల్‌ కామరాజు, అలీ,రావు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకి అనూప్‌రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ ఉగాదికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -