రత్తాలుతో కుమ్మేసిన మెగాస్టార్…

100
Ratthaalu Full Song With Lyrics

అభిమానుల నిరీక్షణకు మరి కొద్ది రోజుల్లో తెరపడనుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ని వెండితెరపై చూస్తామా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయింది. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఇప్పటికే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, సుందరి, యూ అండ్ మీతో కుమ్మేసిన చిరు…తాజాగా రత్తాలు రత్తాలు అనే మాస్‌ సాంగ్‌తో అభిమానులతో ఈలలు వేయించాడు.

ఇప్పటికే ఈ పాటను యూ ట్యూబ్‌లో 4 లక్షల మందికి పైగా చూడగా, 20 వేల మంది లైక్‌ చేశారు. రాఘవా లారెన్స్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో చిరు స్టెప్స్ బాస్ ఈజ్ బ్యాక్ అనేలా ఉన్నాయి. చివరిగా అల్లు అరవింద్ వేసిన విజిల్ వీడియోకే హైలైట్ అని చెప్పవచ్చు. ఏదేమైన అభిమానులలో మెగాస్టార్ క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఉంది.కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు.

Ratthaalu Full Song With Lyrics | Khaidi No 150 | Chiranjeevi, Kajal | Devi Sri Prasad