పవర్‌స్టార్‌ మళ్ళీ మొదలుపెట్టాడు..

207
Pawan Kalyan's next film with Trivikram launched
- Advertisement -

‘కాటమరాయుడు’తో విజయం అందుకున్న పవన్‌కల్యాణ్‌.వెంటనే మరో ప్రాజ్టెక్ట కోసం రెఢీ అయ్యాడు.కాటమరాయుడు తమిళంలో ఘన విజయం సాధించిన ‘వీరమ్‌’కి ఇది రీమేక్‌. అయినా పవన్‌ శైలికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి విడుదల చేశారు.సినిమా పెద్ద హిట్‌ కాకపోయినా పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం పండగ చేసుకున్నారు.మరి కాటమరాయుడు సినిమా పూర్తి కాకముందే మరో మూడు సినిమాలు ప్లన్‌ చేసుకున్నాడు పవన్‌.వాటిలో ముందు త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కనుందట.అయితే ఈ సినిమా కోసం డేట్స్‌ కూడా ఇచ్చేశాడు పవన్‌

Pawan Kalyan's next film with Trivikram launched

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలించేలా చేస్తూ ఈ సినిమా షూటింగ్ రేపు మొదలు కానుంది. ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. మొదటి రోజు నుంచే షూటింగులో పవన్ పాల్గొననున్నాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో మరో హిట్‌ కాయం అంటున్నాయి సిని వర్గాలు

ఆయన కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తయిన తరువాత, సంతోష్ శ్రీనివాస్ తో సినిమాను పవన్ మొదలెట్టనున్నాడట. ఆ తరువాత ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా జరగనుంది. మొదట ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆలస్యంగా మొదలుపెడుతున్నందువలన దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

- Advertisement -