పూరీకి వాళ్లంటే ఇష్టమా..కాదా?

211
- Advertisement -

పూరీ తన సినిమాలో హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరోఐనా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ. అలాగే సినిమాకు టైటిల్స్ పెట్టడంలో మనోన్ని మించినవాడు లేడు.మరి పూరీ సినిమాల్లో హీరో ఎంత రెక్లెస్ గా ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోతో కానీ.. ఇతర కేరక్టర్లతో కానీ చెప్పించే డైలాగ్స్ వింటే.. పూరీ మహిళలను ఇంత దారుణంగా భావిస్తాడా అనిపించక మానదు.

తాజాగా రోగ్ మూవీలో అయితే ఈ స్థాయి మరింతగా పెరిగిపోయింది. దీనికి ముందు లోఫర్ మూవీలో అయితే.. సావిత్రి లాంటి లేడీస్ ఇప్పుడు లేరని.. డైనోసార్ల మాదిరిగా అంతరించిపోయారని అనిపించేస్తాడు. అంటే అసలిప్పుడు మంచోళ్లు లేరని పూరీ అనుకుంటున్నాడా అనిపించక మానదు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ దర్శకుడు తన భార్యా కూతుళ్లను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తాడు. పూరీ కనెక్ట్స్ అంటూ తను ప్రారంభించిన ఓ ట్యాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాధ్యతలను.. తన సినిమా జ్యోతిలక్ష్మిలో హీరోయిన్ గా నటించిన ఛార్మికి అప్పగించాడు. అంతేనా.. జ్యోతిలక్ష్మి మూవీలో ఛార్మితో క్లైమాక్స్ లో చెప్పించిన డైలాగ్ గుర్తు చేసుకోవాలి.

Puri Jagannadh about girls

‘దేవుడికి కూడా ఆడాళ్లంటే చులకనే. అందుకే అందరూ కొడుకులనే కన్నారు తప్ప.. ఒక్క దేవుడు కూడా కూతురును కనలేదు’ అనేది జ్యోతిలక్ష్మిలో క్లైమాక్స్ డైలాగ్. పూరీకి ఆడాళ్లంటే ఎంత గౌరవమో చెప్పేందుకు ఇదొక్కటి చాలు. వేరే సినిమాలో హీరో కేరక్టర్ ను సింగిల్ డైలాగ్ లో వర్ణించేందుకు రాసిన డైలాగ్స్ ను పట్టుకుని.. వన్ సైడెడ్ గా పూరీకి స్త్రీలంటే పడదు అనడం తప్పున్నర తప్పంతే.

- Advertisement -