దానికి ఓకే…కాని పెళ్ళి మాత్రం వద్దు..

125
Sonakshi Sinha to get MARRIED to beau Bunty ...

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చెప్పిన మాటలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ‌పై ఇటీవ‌లి కాలంలో బోలెడ‌న్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సోనాక్షి ఓ కుర్రాడితో ల‌వ్‌లో ఉంది.

అత‌డితో క‌లిసి చెట్టు, పుట్ట‌ల వెంట తిరుగుతోంది. క్ల‌బ్బు, ప‌బ్బుల్లో డ్యాన్సులు చేస్తోంది. అంతేకాకుండా ఇక తను చెట్టాపట్టాలేసుకొని ఇరిగే అత‌డినే పెళ్లాడేయ‌బోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్ర‌చార‌మైంది. అయితే ఇదే ప్ర‌శ్న సోనాక్షినే అడిగితే దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పింది.
 Sonakshi Sinha to get MARRIED to beau Bunty ...
షికార్లు వ‌ర‌కూ అత‌డితో, పెళ్లి మాత్రం వేరొక‌రితో అనేసింది. బంటి స‌చ్‌దేవ్‌తో షికార్లు చేస్తున్న మాట నిజ‌మే కానీ, ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న లేదు. అస‌లు నాకు న‌చ్చేవాడెవ‌డో నాకే అర్థం కావ‌డం లేదు అంటూ క్లారిటీ లేని స‌మాధానం ఇచ్చింది.

బంటితో ల‌వ్ మ్యాట‌ర్‌ని మాత్రం క‌న్ఫామ్ చేయ‌కుండా దాట‌వేసింది. అయితే బంటితో క‌లిసి చిందులేసే ఫోటోల్ని సామాజిక మాధ్య‌మంలో పోస్ట్ చేస్తున్న ఈ అమ్మ‌డి వైఖ‌రిని అంతా త‌ప్పుప‌డుతున్నారు. ప్రేమ ఒక‌రితో, పెళ్లి వేరొక‌రితో అంటే ఎలా కుదురుతుంది అంటూ  బాలీవుడ్‌ జనాలు  ఎవరి  స్టైల్లో వారు  సానాక్షి వైఖరి పై గుసగుసలాడుకుంటున్నారు.