రికార్డు స్ధాయిలో కాటమరాయుడు రైట్స్‌..!

247
Pawan Kalyan's Katamarayudu Rights sold
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కాటమరాయుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 80 శాతం పూర్తికావడంతో సినిమా, బిజినెస్ ప్రమోషన్ పనులు మొదలయ్యాయి. పవర్ స్టార్ స్టామినాకు తగ్గట్టుగానే భారీ రేట్లకు అన్నిఏరియాల రైట్స్‌తో పాటు  ఓవర్సిస్ రైట్స్ కూడా అమ్ముడవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి గట్టిపట్టున్న నైజాం ఏరియా రైట్స్‌ కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా పవన్ అభిమాని హీరో నితిన్‌ ఏషియన్ మూవీస్‌తో కలిసి సొంతం చేసుకున్నాడు.

ఇక ఓవర్సిస్‌లోనూ కాటమరాయుడు సత్తా చాటుతున్నాడు. పవన్ సినిమా రైట్స్‌ను దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు ఓవర్సిస్ రైట్స్  రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ కేవలం 24 గంటల్లో 5 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించగా టాలీవుడ్‌లో ఏ సినిమాకు సాధ్యం కాని విధంగా 2 లక్షల లైక్స్‌తో సత్తాచాటింది. దీంతో పవన్‌ కాటమరాయుడిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఇక అమెరికా పర్యటన ముగించుని హైదరాబాద్ చేరుకున్న పవన్‌ … కాటమరాయుడుతో టీంతో కలిసి షూటింగ్‌లో సందడి చేశాడు. మార్చి 10 నాటికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఉగాది కానుకగా  విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -