చెర్రీతో ఉపాసన స్వీట్‌ మెమోరీస్‌

238
- Advertisement -

అక్కినేని నాగచైతన్యకు సమంత ప్రేమికుల రోజు సందర్భంగా ముద్దు ఇచ్చిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెప్పగా తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ దంపతులు సైతం వాలెంటైన్స్ డేని ఘనంగా జరుపుకున్నారు.   వాలంటైన్స్ డే మా జీవితంలో మరో మరిచిపోని రోజుగా మారిందని ఉపాసన ట్వీట్ చేసింది.

Cherry & Upasana valentine day
ఫిబ్రవరి 14న వాలంటైన్ డేను పురస్కరించుకొని ఉపాసన ప్రపంచ ప్రేమికులందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అని శుభాకాంక్షలు తెలిపింది.  తన ఆప్త మిత్రుడు రామ్‌చరణ్‌ను వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన గుర్తు చేసుకున్నారు. రామ్‌చరణ్‌తో సంతోషంగా గడిపిన వివిధ సందర్భాల్లో దిగిన చక్కటి ఫొటోలను పోస్ట్‌ చేశారు.

Cherry & Upasana valentine day

ఉపాసన షేర్ చేసిన చిత్రాలు వారి మధ్య ఉన్న అన్యోన్యతను చాటి చెప్పాయి. రాంచరణ్ భుజంపై తలవాల్చి సేదతీరుతున్న చిత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. సముద్రపు ఒడ్డున బైక్ సవారీ చేస్తున్న చిత్రం, డ్యాన్స్ బీటు వేస్తున్న రాంచరణ్, ఉపాసన చిత్రం నెటిజన్లను హుషారెత్తించింది.‘ధృవ’తో మంచి హిట్‌ అందుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కోసం సిద్ధమౌతున్నారు.

Cherry & Upasana valentine day

- Advertisement -