కొత్త నోటుతో కాటమరాయుడు

110
Pawan kalyan with 2000 Note

పాతనోట్లు రద్దు అయ్యాయి, కష్టపడితేనే కాని కొత్త నోట్లు ప్రజల చేతిలో పడటంలేదు. పోతే పోయిందిలే పాత నోటు వచ్చిందిగా కొత్తనోటంటూ ప్రజలు ఆ నోటుని చూసి మురిసిపోతున్నారు. సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా కొత్తనోట్లను ఆశ్బర్యంగా చూస్తున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు కొత్త రెండువేల రూపాయల నోటు వచ్చింది.

Pawan kalyan with 2000 Note

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు కొత్త నోటును అసలు చూడలేదో.. లేక చూసే తీరిక లేదో గానీ, షూటింగ్ విరామ సమయంలో పవన్ ఆ నోటును చాలా పరిశీలనగా చూశారు. పాత వంద రూపాయల నోటుతో దాన్ని పోల్చి చూసి ఏవేం అంశాలు అందులో ఉన్నాయి, ఏం లేవన్న అంశాలను గమనించి చూసినట్లు ఆ ఫొటోలలో కనిపిస్తుంది.

Pawan kalyan with 2000 Note

పవర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌మీడియా ద్వారా తాజాగా ఈ ఫొటోను పంచుకున్నారు. ‘కాటమరాయుడు’ సినిమా సెట్‌లో పవన్‌ ఇలా పెద్ద నోట్లను పరిశీలిస్తున్నారు అని పోస్ట్‌ చేశారు. పవన్‌ ప్రస్తుతం కిషోర్‌ కుమార్‌ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీని తర్వాత ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

Pawan kalyan with 2000 Note

ఇటీవలె పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన పవన్‌…నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయం అని అన్నారు.. నల్లధనాన్ని బయటకు తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉందని.. డబ్బులు పంచడం ద్వారా ఓటు కొనుక్కోనే స్థాయికి మన రాజకీయ నాయకులు వెళ్ళే పరిస్థితులున్న ఈ రోజుల్లో పెద్ద నోట్లు రద్దు మంచి నిర్ణయమని.. అదే సమయంలో ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఇబ్బందులు పడవచ్చు అని కూడా చెప్పారు..

Pawan kalyan with 2000 Note