రొమాంటిక్ లవ్‌…టైంపాస్‌ ‘రెమో’

301
Remo Movie review
- Advertisement -

శివకార్తీకేయన్‌,కీర్తి సురేష్‌లు జంటగా తెరకెక్కిన చిత్రం రెమో. తమిళంలో సూపర్ హిట్ సాధించిన రెమో చిత్రాన్ని…తెలుగులో అదే పేరుతో నిర్మాత దిల్ రాజు ఆ పేరుతోనే తెలుగులో విడుదల చేశారు. కేవలం వినోదాన్ని నమ్ముకొని ఫక్తు కమర్షియల్‌ సూత్రాలతో అల్లిన కథ ఇది. అలాంటి చిత్రాలు తెలుగులోనూ ఆదరణ పొందుతాయన్న నమ్మకంతో దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. తమిళంలో అంత పెద్ద హిట్టైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎలా అలరించిందా చూద్దాం…

కథ:

ఎస్కె (శివకార్తికేయన్) అనే కుర్రాడు సినిమాలో హీరో కావాలనే లక్ష్యంతో సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో కావ్య (కీర్తి సురేష్) ను చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమెకు అప్పటికే నిశ్చితార్థం అయిపోతుంది. అనుకోకుండా ఓ సారి నర్సు వేషం వేయాల్సివస్తుంది. అ అవతారంలోనే కావ్యని రెమోగా పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి ఎలా దగ్గరయ్యాడు. తన ప్రేమను ఎలా బయటపెట్టాడన్నదే సినిమా కథ.

Remo Movie review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్..హీరో శివకార్తికేయన్‌, కామెడీ,పాటలు. తన ప్రేమ సాధించడానికి హీరో చేసే ప్రయత్నాలు వినోదాన్ని పండిస్తునే…ఆసక్తికరంగా ఉంటాయి. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్‌ రెండు పాత్రల్లో ఇమిడిపోయాడు. రెమో పాత్రలో శివ నటన ఆకట్టుకొంటుంది. ఇక దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ కథ పాతదే అయినా కథనాన్ని పెద్దగా కొత్తగా ఏమీ రాసుకోలేదుగాని సన్నివేశాల చిత్రీకరణ, నటీనటుల నుండి నటనను రాబట్టుకోవడంలో, వారి మధ్య రొమాన్స్ ను పండించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. తమిళంలో మధురై యాసతో సాగే డైలాగులు నవ్వించాయి. ‘నేను శైలజ’తో ఆకట్టుకొన్న కీర్తి సురేష్‌ మరోసారి అందంగా కనిపించింది. మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ లో హీరో – హీరోయిన్, హీరో – చిన్నపాప మధ్య నడిచే భావోద్వేగ పూరిత సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్సవడం.సినిమా ఫస్టాఫ్ మొదలుపెట్టడం బాగానే ఉన్నా పోను పోను అది నెమ్మదించి బోర్ కొట్టించింది. సెకండాఫ్ లో కూడా కాస్త నెమ్మదించింది. రొమాంటిక్ ఫీల్ ఉన్నపటికీ సినిమా చూస్తన్నంత సేపు ఎక్కడో కాస్త అసంతృప్తి కలుగుతూనే ఉంది. సెకండాఫ్ క్లైమాక్స్ అన్ని సినిమాల్లాగే ఊహించదగ్గ ముగింపే పైగా ఎక్కువ సేపు సాగదీశారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా అందంగా తీర్చిదిద్దారు. అలాగే హీరో శివకార్తికేయన్ కు లేడీ గెటప్ వేసిన మేకప్ ఆర్టిస్టుల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. లేడీ గెటప్ లో శివకార్తికేయన్ ను పర్ఫెక్ట్ గా అమర్చేశారు. ఇక కీలక సన్నివేశాల్లో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఆర్. డి. రాజా నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

Remo Movie review

తీర్పు:

‘మేడమ్‌’, ‘భామనే సత్యభామనే’ తరహాలో ఇలాంటి జోనర్‌ కథలే వచ్చిన రెమో కొత్తగా అనిపిస్తుంది. కావాల్సినంత వినోదం పండించడంతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.శివ కార్తికేయన్ అద్భుత నటన, కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య సాగే లవ్ రొమాన్స్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్. తెలుగు నేటివిటీ మిస్సవడం అనే ఇబ్బందిని పట్టించుకోకుండా,రొమాంటిక్ ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా రెమో.

విడుదల తేదీ:25/11/2016

రేటింగ్:3/5

నటీనటులు: శివకార్తికేయన్, కీర్తి సురేష్

సంగీతం: అనిరుథ్‌

నిర్మాత: దిల్‌రాజు

దర్శకత్వం: బక్కియరాజ్‌ కన్నన్‌

- Advertisement -