ప‌వ‌న్ క‌న్నా చిరంజీవే బెట‌రా..?

301
chiranjeevi-pawankalyan
- Advertisement -

ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు? అన్న ప్రశ్నకు ఎవరి సమాధానాలు వారికి ఉన్నా.. అంతిమంగా కలెక్షన్సే దాన్ని డిసైడ్ చేస్తాయి. అలా ప్రతీ శుక్రవారం ఈ జాబితా మారిపోతూనే ఉంటుంది.   ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తున్నాయి. అది కూడా సినిమా బావుందనే టాక్ ఉంటేనే… సినిమా బాగాలేద‌నే టాక్ ఉంటే ఇక అంతే సంగ‌తి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఈ రోజుల్లో విడుదలైన మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద ఎదో విధంగా సరికొత్తగా రికార్డులను నమోదు చేస్తున్నాయి.

 pawankalyan - trivikram srinivas

ఈసారి సంక్రాంతి పండుగ‌కు భారీ అంచ‌నాల మ‌ద్య విడుద‌లైన సినిమాలు అంత‌గా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. స్టార్ హీరోలు న‌టించిన సినిమాలు కాబ‌ట్టి మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ రెండవరోజు డివైడ్ టాక్ రావడంతో దారుణమైన డిజాస్టర్ అందుకున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అయితే ఊహించని స్థాయిలో ఓటమిని మూటగట్టుకుంది.

chiranjeevi khaidi no 150 movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తుండడంతో మొదట ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు చెలరేగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు మొదటి వారం కలెక్షన్స్ మొత్తంగా రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి. టాలీవుడ్ డిజాస్టర్స్ లలో అజ్ఞాతవాసి ఒకటిగా నిలిచింది.గ‌త సంవ‌త్సరం ఇదే సంక్రాంతి పండుగ‌కు చిరంజీవి న‌టించిన సినిమా ఖైదీ నెంబర్ 150 మొద‌టి వారంలోనే 77 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. అంటే ఈ లెక్క‌నే చిరంజీవి క‌న్నా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌సూళ్ల‌లో వెన‌క‌బ‌డి ఉన్నాడ‌నే చెప్ప‌వ‌చ్చు.

- Advertisement -