సింహానికి చుక్క‌లు చూపించిన సివంగి…

265
photo-viral-social-media
- Advertisement -

అడవిలో భారీ ఆకారంలో ఉండే ఏనుగు, ఎలుగుబంటి, ఖడ్గమృగం, జిరాఫీ వంటివి ఉన్నప్పటికీ ఒక్క సింహాన్నే అడవికి రాజని ఎందుకంటారో తెలుసా?.. సింహం ఒకసారి ఏ జంతువు మీదికైనా దూకిందంటే.. ఇక దాన్ని ఆపడం, నిలువరించడం ఎవరి తరమూ కాదు. వీటికి నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువ. పరిమాణంలో దానికంటే ఎంత పెద్ద జంతువులైనా వేటాడి తినడానికి సింహం ఏమాత్రం జంకదు. పెద్ద పెద్ద జంతువుల్ని సింహాలు తమ బలమైన పళ్లతో చీల్చి, పదునైన పళ్లతో ముక్కలు చేసి తాపీగా ఆరగిస్తుంది.

photo-viral-social-media

దీంతో అడ‌వికి రాజు సింహం అని అంటారు. కానీ ఇప్పుడు ‘అడవికి రాజు సింహం’ అన్న మాటకి నూకలు నిండుతున్నాయి అనిపిస్తోంది. ‘‘అడవికి రాణిని నేనే!’’ అన్నట్లుగా ఒక ఆడసింహం జూలు విదిలించింది, గర్జించింది. ఎక్క‌డ‌ని అనుకుంటున్నారా… టాంజానియాలో ని సెరెంగిటి నేషనల్‌ పార్కులో.. సింహం, సివంగి రెండు జంట‌గా ఉన్నాయి.

photo-viral-social-media

ఇంత‌లో ఏమ‌యిందో ఏమో కానీ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా సివంగి సిహంపై జూలు విదిల్చింది. పెద్ద‌పెట్టున గ‌ర్జించింది. అంతే సివంగి గ‌ర్జ‌న‌కు సింహం త‌ల‌వంచింది. త‌న ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. ఈ ఫోను వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫ‌ర్ జార్జ్ త‌న కెమెర‌లో బంధించారు. ఈ ఫోటోను చూసిన వారు అడ‌వికి రాజు సింహం అయుండొచ్చు.. కానీ.. సింహ‌న్ని భ‌య‌పెట్టేది సివంగేన‌ని చ‌ర్చించుకుంటున్నార‌ట‌..

- Advertisement -