ఫ్యాన్స్‌ పై చెయ్యి చేసుకున్న బాలకృష్ణ….

93
Balakrishna Throws Away Fan

బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి “శాతకర్ణి” జీవితం ఆధారంగా తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి”…. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగులుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Balakrishna Throws Away Fan

అయితే బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. దర్శకుడు జాగర్లమూడి క్రిష్, హీరో బాలయ్య ‘శాతకర్ణి’ షో చూసేందుకు నిన్న కూకట్‌పల్లి లోని భ్రమరాంబిక థియేటర్‌కు వెళ్లారు. థియేటర్‌లోకి అడుగుపెట్టగానే అభిమానులంతా ‘జై బాలయ్య’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.సినిమా అయిపోయిన తర్వాత ‘ఓ అభిమాని బాలకృష్ణకు దగ్గరగా వచ్చిసెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అతడి చేతిని బాలయ్య నెట్టేయడం, మొబైల్ కింద పడడం’ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనిని కొంత మంది బాలకృష్ణ అభిమానులు సమర్ధించగా మరికొంత మంది మాత్రం హీరోలకు చికాకు తెప్పించే విధంగా ప్రవర్తిస్తే ఇలానే ఉంటుందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Balakrishna Throws Away Fan

అయితే అదే థియేటర్ వద్ద, ఈ ఘటన జరిగినప్పుడు పలువురు అభిమానులు దీనిపై స్పందిస్తూ ‘థియేటర్‌ లోపల ఓ అమ్మాయి అడిగితే కాదనకుండా లేచి, నిలబడి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన బాలయ్య, థియేటర్ బయట ఓఅబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఇలా చేయడమేంటి’అని మండిపడుతున్నారు. ఏది ఏమైన బాలకృష్ణ లింగ వివక్ష చూపటం సరైది కాదంటు అక్కడున్న పలువురు అభిమానులు అసంహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.

Balakrishna Throws Away Fan Iphone At Gautamiputra Satakarni Premier