బన్నీకి థ్యాంక్స్ చెప్పిన పవన్ !

134
pawan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో తీవ్ర విషాదం నెల‌కొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాద వశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు చనిపోగా నలుగురు గాయపడ్డారు.

కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకురాగా వారికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్. చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన రాంచరణ్ కి,అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కి,నిర్మాతలు – దిల్ రాజు, ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ నవీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మృతుల‌ను సోమ‌శేఖ‌ర్, రాజేంద్ర‌, అరుణాచ‌లంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండ‌డం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.