పవన్ కళ్యాణ్‍కు కరోనా పాజిటివ్..

34
pawan

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన వ్యవసాయం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అపోలో ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పవన్‌ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఎక్కడ చూసినా గతేడాది కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారని, రిపోర్ట్ ప్రకారం ఆయనకు పాజిటివ్ అని తేలిందని తెలుస్తుండటం మెగా ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది.