నేను చేయలేనిది రామ్ చరణ్‌ చేశాడుః పవన్ కళ్యాణ్‌

315
pawan-jpg_710x400xt
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సైరా. స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించారు. బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నాలు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఇక ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఈకార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజమౌళిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సైరా చిత్రం భారతదేశ గొప్పతనాన్ని చాటుతుందన్నారు. ఈసినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇలాంటి సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రామ్ చరణ్ కు అభినందనలు తెలిపారు.

అన్ని దేశాలు భారత్ పై దండెత్తినా, భారత్ మాత్రం ప్రపంచంలోని ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదని వివరించారు. భారతదేశం అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం అని అభివర్ణించారు. తన అన్నయ్య చిరంజీవి గొప్ప చిత్రాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి కోరుకునేవాడ్నని, తాను ఇలాంటి సినిమా చేయలేకపోయినా, రామ్ చరణ్ మాత్రం ఇలాంటి చిత్రాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా నిర్మించాడని, రామ్ చరణ్ నిజంగా అభినందనీయుడని పేర్కొన్నారు. నాకు ఇంత స్టార్ డమ్ వచ్చిన అన్నయ్యతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను..కానీ రామ్ చరణ్ ఆ పని చేసినందుకు గర్వంగా ఉందన్నారు.

- Advertisement -