- Advertisement -
సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. స్కూల్‌లో అగ్నిప్రమాదంలో సంభవించడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ గిరిజనులను కలిశాక సింగపూర్ వెళ్తానని పవన్ అన్నారు.
Also Read:BRS రజతోత్సవం..3వేల బస్సులు ఇవ్వండి
పవన్ కల్యాణ్ ఇవాళ సుంకరమిట్టలో బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అలాగే, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వద్ద ఎకో టూరిజంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అడవితల్లి బాట ప్రోగ్రాంను ప్రారంభించారు.
- Advertisement -

