హీరోయిన్ అమల ఇంట విషాదం..

513
amala poul
- Advertisement -

ప్రముఖ సినీ హీరోయిన్ అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రాత్రి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తండ్రి మరణవార్తతో అమలాపాల్ కన్నీటిపర్యంతమైంది. ఓ సినిమా షూటింగ్ లో ఉన్న ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరింది. ఈరోజు వర్గీస్ పాల్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Amala Paul

మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో 3 నుంచి 5 గంటల మధ్యలో అమలా తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి. పాల్ వర్గీస్‌కి భార్య ఆన్నిస్ పాల్.. పిల్లలు అమల, అభిజీత్ ఉన్నారు. అమల సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు తండ్రి పాల్ వర్గీస్..ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత ఆమె నటిగా నిలదొక్కుకోవడంతో ఎంతో ఆనందించినట్టు అమలా పాల్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

- Advertisement -