జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత మూడోసారి జత కడుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. టాలీవుడ్ పరిశ్రమలోని క్రేజీ కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే గట్టి నమ్మకం , ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఉంది. అందుకే వీరి కలయికలో రాబోతున్న సినిమా పై భారీ స్థాయి అంచనాలున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మళ్లీ నటించాలని ఆయన అభిమానులంతా కోరుకున్నారు. వాళ్ల కోరిక మేరకే ప్లాన్ చేసిన పవన్ .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో లవ్,రొమాన్స్,సెంటిమెంట్, కామెడీతో పాటు యాక్షన్ కి కూడా త్రివిక్రమ్ పెద్ద పీట వేశాడట.
అయితే ఈ సినిమాలో పవన్ కోసం త్రివిక్రమ్ మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ యాక్షన్ దృశ్యాలు ఒక రేంజ్ లో వుంటాయట. పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు వచ్చే సినిమా కనుక, ఆ దిశగా కూడా ఫ్యాన్స్ కి పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఆయన ఈ సినిమా విషయంలో కేర్ తీసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకుంటున్నారు. పవన్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో బ్లక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.