మిథాలీ….వరల్డ్ రికార్డు

246
Mithali breaks record for most runs in Women ODIs
- Advertisement -

భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఉమెన్స్ ప్రపంచ కప్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలి 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 183 వన్డేల్లో వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి మహిళగా ఆమె అవతరించింది. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేసి వెనుదిరిగింది మిథాలీ.

ఇన్నాళ్లూ 5992 ర‌న్స్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ ఎడ్వ‌ర్డ్స్ పేరిట ఉన్న రికార్డు బ‌ద్ధ‌లైంది. మ్యాచ్‌కు ముందు 5959 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్న మిథాలీ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ఎడ్వ‌ర్డ్స్ కంటే త‌క్కువ మ్యాచుల్లో ఈ ఘ‌న‌త సాధించిన రికార్డు కూడా మిథాలీ సొంత‌మైంది. 16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసింది. ఇప్ప‌టికీ అత్యంత పిన్న వ‌య‌సులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిటే ఉంది.

- Advertisement -