ప్రజలతోనే.. పవన్ కామెంట్స్‌..

58
pawan
- Advertisement -

తమకు ప్రజలతోనే పొత్తు అని… ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. నిన్న ఆయన ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో భారీ సభలో పాల్గొన్నారు. పంటలు పండక గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున పవన్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 80 కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అందించారు.

అనంతర పవన్ పొత్తుల అంశంపై స్పందించారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని అన్నారు. తమకు ప్రజలతోనే పొత్తు తప్ప ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోవడంలేదని, ప్రజలు ప్రభుత్వాలను నిలదీసేలా తయారుచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 2009లో చెప్పినదానికే కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు పార్టీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దత్తపుత్రుడిని తాను కాదని.. సీఎం జగన్ మాత్రం సీబీఐ దత్తపుత్రుడేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. 2019లో వైఎస్సార్సీపీని నమ్మిన ప్రజలు ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారని తేల్చిచెప్పారు పవన్‌.

- Advertisement -