బీజేపీ వేధింపులే రోహిత్‌ ఆత్మహత్యకు కారణం..

215
Pawa
- Advertisement -

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ వ్యవహార శైలిని తూర్పారపట్టారు. ‘రోహిత్‌ భాజపాను వ్యతిరేకించారు.. అంతమాత్రాన భాజపా అతడిని వేధించాలా?. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది.. రోహిత్‌ అంశాన్ని భాజపా ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంది’ అని పవన్‌ ప్రశ్నించారు. దేశంలో కొన్ని లక్షల మందిలా రోహిత్ వేముల కూడా బీజేపీని వ్యతిరేకించాడు లేదా ద్వేషించాడు. అంత మాత్రాన వేధింపులకు దిగుతారా? వ్యతిరేకించడం అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అని ఆయన ప్రశ్నించారు. రోహిత్‌ వేములపై విధించిన సస్పెన్షన్‌ అతడి ఆత్మహత్యకు దారితీసిందని పవన్‌ అభిప్రాయపడ్డారు. రోహిత్‌ మరణాన్ని భాజపా వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేశాయని మండిపడ్డారు. వర్శిటీలు రాజకీయ పార్టీలకు యుద్ధభూమి కాకూడదని పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.

 hcu-students-furious-on-pawan-kalyan.56a34e62c8803_730x410

యూనివర్సిటీ నిబంధనలకు లోబడి పరిష్కారాలు కనుగొనాలి తప్ప వేధింపులకు దిగడం, కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం హర్షణీయం కాదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకుందని ఆయన ఆరోపించారు. దీనికి తోడు యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడం, అంతటితో ఆగకుండా యూనివర్సిటీ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం, ఈ క్రమంలో అతను ఎవరి గ్రూపులో ఉన్నాడో ఆ గ్రూపు నుంచి అవసరమైన సహకారం అందకపోవడం కూడా అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ వేముల ఆగ్రహం, నిరాశానిస్పృహలకు దారితీసిందని, ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి సరైన కౌన్సిలింగ్ అవసరమని, అది రోహిత్ వేములకు అందలేదని ఆయన చెప్పారు.

Pawan

ఈ ఘటనలో అన్నింటికంటే బాధాకరమైన అంశమేంటంటే… రోహిత్ వేముల ఆత్మహత్యను బీజేపీయేతర రాజకీయ పార్టీలు వాటి స్వలాభానికి వాడుకోవాలని చూస్తే…బీజేపీ దాని మిత్రపక్షాలు రోహిత్ వేముల దళితుడు కాదు అని నిరూపించడంలో బిజీగా మారిపోయాయని మండపడ్డారు. వీళ్లంతా భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్ని ఇంగిత జ్ఞానం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన యూనివర్సిటీలు విద్యాలయాలుగా కంటే రాజకీయపార్టీల బలం నిరూపించుకునే మైదానాలుగా మారిపోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శించారు. రీసెంట్ గా గోవధ నిషేదంపై బీజేపీని నిలదీసిన పవన్..మరోసారి రోహిత్‌ ఆత్మహత్యపై భాజాపాను నిలదీశారు.

Pawan

- Advertisement -