రివ్యూ : నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌

263
Nanna Nenu Na Boyfriends
- Advertisement -

ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన పాత్రల్లో తెరకెక్కింది. ట్రైలర్,పోస్టర్లతో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. కుమారి 21f తో కుర్రకారును ఉర్రూతలూగించిన హెబ్బా పటేల్‌…ఈ సినిమాతో అదేజోరు కంటిన్యూ చేసిందా లేదా చూద్దాం…

కథ :

ఉద్యోగం కోసం సిటీకొచ్చిన ఒక అమ్మాయి పద్మావతి (హెబ్బా పటేల్) పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా తనకిష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. గోకుల్ (నోయెల్), నాని (అశ్విన్), నమో (పార్వతీశం)లను ప్రేమిస్తుంది. ఈ ముగ్గురు కూడా పద్మావతిని ప్రాణంగా ప్రేమించి ఆమె కోసం జీవితంలో అన్నీ వదులుకోవడానికి సిద్దపడతారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరిని ప్రేమించాలో తెలియక తికమకలో పడిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది..?పద్మావతిని ప్రేమించిన ఆ ముగ్గురు ఏం చేశారు..?చివరికి పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది..? అన్నదే కథ.

Nanna Nenu Na Boyfriends

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్… హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్, నోయల్, అశ్విన్, నూకరాజుల నటన, రావు రమేష్ అభినయం, చోటా కె నాయుడు చాయాగ్రహణం. సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ సాయి కృష్ణ రాసిన ప్రేమ కథ.ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం అనే విపరీతమైన పాయింట్ చుట్టూ సాయి కృష్ణ ఆమోదయోగ్యమైన కథనే రాసుకున్నాడు. కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ ఎపిసోడ్స్,సెంటిమెంట్ సీన్లు, కథలో కీలక మలుపు బాగా ఆకట్టుకున్నాయి. పద్మావతి పాత్రలో హెబ్బా పటేల్ అద్భుతంగా నటించింది. నోయెల్,అశ్విన్,పార్వతీశం నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఫస్టాఫ్ ఓపెనింగ్. హెబ్బా పటేల్ ముగ్గురు అబ్బాయిల్ని వలలో వేసుకునేందుకు చేసే ప్రయత్నాలు కొన్ని రొటీన్ గా ఉండి బోర్ కొట్టించాయి. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే కూడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. కామెడీ లేకపోవటం మరో మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికి వస్తే దర్శకుడు స్క్రీన్‌ ప్లే పై మరింత వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రసన్న కుమార్ అందించిన డైలాగ్స్ బాగున్నాయి. హెబ్బా పటేల్, రావు రమేష్ ల పాత్రలకు ప్రసన్న కుమార్ రాసిన డైలాగులు బాగా పేలాయి. శేఖర్ చంద్ర మంచి సంగీతం అందించాడు. చోటా కే నాయుడు అందించిన చాయాగ్రహణం సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Nanna Nenu Na Boyfriends

తీర్పు :

లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ .హెబ్బా పటేల్ నటన,లవ్ సీన్స్ , ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్లు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కాగా బోరింగ్ రొమాంటిక్, కామెడీ సీన్లు,స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా వీకెండ్ లో మంచి చాయిస్ గా నిలిచే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.

విడుదల తేదీ : 12/16/2016
రేటింగ్ : 3/5
నటీనటులు : హెబ్బా పటేల్, అశ్విన్, నోయెల్, పార్వతీశం
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : బెక్కం వేణు గోపాల్
దర్శకత్వం : భాస్కర్ బండి

- Advertisement -