పవన్ త్వరగా కోలుకోవాలి: మహేశ్

53
mahesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో పవన్ త్వరగా కోలుకోవాలని సినీ,రాజకీయాలకు అతీతంగా అంతా ఆకాంక్షించగా తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సైతం స్పందించారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్… స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అంటూ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు మహేశ్‌.

ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.