కరోనా సెకండ్ వేవ్…భారత సైన్యం కీలక నిర్ణయం

31
army

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులను 50శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది.

ఇకపై ఉద్యోగులు తమకు కేటాయించిన సమయంలోనే కార్యాలయాలకు రావాలని, భౌతిక దూరంతో పాటు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

పారామిలటరీ దళాల్లో కరోనా కేసులు గత పది రోజుల్లో ఐదు రెట్లు పెరిగాయి. ఏప్రిల్‌ 5న ఆర్డ్మ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన జవాన్ల సంఖ్య 522 ఉండగా.. ప్రస్తుతం 2,915కు చేరింది.