తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి అనుమతివ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. జల్లికట్టుకు మద్దతుగా అన్నివర్గాల ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి మద్దతిస్తున్నారు. తమిళ అగ్ర సినీనటులతో పాటు టాలీవుడ్ సైతం స్పందించింది. ప్రిన్స్ మహేష్ బాబు, అఖిల్ జల్లికట్టుకు మద్దతుగా నిలవగా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.
జల్లికట్టు నిషేధం ద్రవిడ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా అభివర్ణించిన పవన్ దక్షిణ భారత దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. జల్లికట్టు, కోడిపందేలను నిషేదించటం భారత ప్రభుత్వం ద్రవిడుల సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయటమే అన్నారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తరువాత ఆంధ్రలో జరిగిన కొన్ని రాజకీయ సమావేశాల్లో నిషేదం అక్కడి ప్రజలను ఎంత వేదనకు గురి చేసిందో ప్రత్యక్షంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.
ముందుగా తన ఫాం హౌస్ లో దిగిన ఫోటోను ట్వీట్ చేసిన పవన్ తన గోశాలలో 16 ఆవులు ఉన్నాయని, తన పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగుచేస్తున్నానని అన్నారు. నా ఫాంలో ఉన్న ఆవులు, కోడిపుంజులు.. దక్షిణాభారతంలో జల్లికట్టు, కోడిపందేలపై విధించిన నిషేదం గురించి నన్ను ఆలోచింప చేస్తున్నాయి అంటూ కామెంట్ చేశాడు.
ప్రభుత్వం జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేదించింది. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ ట్వీట్ చేశాడు.
The calf n cow in the background are from my personal 'Goshala' of 16 plus cows n calves. pic.twitter.com/QaI3FWmG9a
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu#Kodipandem pic.twitter.com/NH3oeXw2sz
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#jallikattu #kodipandem pic.twitter.com/BVh026xE54
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu #Kodipandem pic.twitter.com/WIQRaC5pAZ
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu #Kodipandem pic.twitter.com/gvpWrGtoFO
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu. #Kodipandem pic.twitter.com/4UvsnDeyG7
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017