చిరు … మహేష్‌తో దిల్ రాజు

248
Mahesh, Chiru Next With Dil Raju
- Advertisement -

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో, నటసింహం బాలయ్య తన 100వ సినిమాతో బాక్సాఫీసు రేసులో దూకడంతో వీరిద్దరితో పోటీ పడలేని చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే, కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దిల్ రాజు మాత్రం ధైర్యంగా ముందడుగు వేశారు. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ నెల 14న శతమానం భవతితో ముందుకు వచ్చిన దిల్ రాజు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఓవర్సీస్‌లోనూ శతమానం భవతి రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తోంది.

Mahesh, Chiru  Next With Dil Raju

బాగా కలిసివచ్చిన సంక్రాంతితో మరోసారి విజయాన్ని అందుకున్న దిల్ రాజు ఇద్దరు అగ్ర హీరోలపై కన్నేశారు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు ప్రిన్స్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లితో కలిసి మహేష్ బాబు సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఈ సినిమాను 2018 వేసవి సెలవుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. అంతేగాదు తమ బ్యానర్ స్ధాయికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

Mahesh, Chiru  Next With Dil Raju

ఇక మంచి కథ దొరికితే మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నానని దిల్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను చూసిన చిరంజీవి తనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారన్నారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వెండి తెరను ఏలుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమకు గోల్డెన్ డేస్ నడిచాయి. ఆ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి తెలుగులో టాప్ పొజిషన్ కు చేరుకుని పరిశ్రమకు భారీ విజయాలను అందించారని తెలిపారు.

- Advertisement -