పెళ్లంటే నవ్వొస్తుంది….

130
Rashi Khanna marriage Secrete

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాందించుకుంది ఈ హీరోయిన్‌. రవితేజతో బెంగాల్‌టైగర్‌, జోరు, జిల్‌, సుప్రీమ్‌ తదితర చిత్రాల్లో నటించిన రాశీఖన్నా ప్రస్తుతం గోపిచంద్‌ ఆక్సిజన్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ అందాల భామ తెలుగుతో పాటు తమిళంలోనూ వరస ప్రాజెక్టులను చేస్తూ ప్రస్తుతం బిజీగా మారింది.

Rashi Khanna marriage Secrete

ప్రస్తుత కాలంలో టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ను మీపెళ్లెప్పుడు అని పలకరించిన ఓకే సమాధానం ఇస్తారు. నాకు ఇంకా చాలా కెరీర్‌ ఉంది. ముందు ముందు టాప్‌ హీరోల సరసన నటించాలి అంటూ సమాధానం చెబుతారు. అయితే తెలుగు పరిశ్రమలో దూసుకెళ్తున్న హీరోయిన్‌లో ఒకరైన రాశీఖన్న కూడా ఇదే సమాధానం చెబుతుంది.

Rashi Khanna marriage Secrete

ఈ పాతికేళ్ల సుందరి తన 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవలనుకుందట.పెళ్లి గురించి రాశీఖన్నా మాట్లాడుతూ…‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’అని చిరునవ్వు చిందించారు. ఇప్పుడు మాత్రం రాశీఖన్నాకి కెరీరే తప్ప పెళ్లి ఊసే లేదని ఆమె మాటల్లో మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.