మెగాస్టార్‌ టీజర్‌పై పవర్‌స్టార్‌ కామెంట్‌..

260
Power Star Pawan Kalyan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు రిలీజైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్ననే ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ‘సైరా’ విడుదలకి చాలా సమయం ఉన్నప్పటికీ, మెగా అభిమానులను ఉత్సాహ పరచాలనే ఉద్దేశంతోనే ఈ టీజర్ ను వదిలారు.

Ram Charan

ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 11 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అందరిలో ఆసక్తి వుందో అర్థమవుతోంది. అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఉన్న ఈ టీజర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటే… సినిమా ఇంకెంత రేంజ్‌లో ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోయాయి.

ఈ టీజర్ కు సంబంధించి ఈ సినిమాను నిర్మిస్తున్న చిరు తనయుడు రామ్ చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చిత్ర బృందానికి చెందిన వాళ్లు కాకుండా బయటి వ్యక్తుల్లో ముందు ఈ టీజర్ చూసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. ‘సైరా’ టీజర్‌ను విడుదల చేసే రోజు ఫైనల్ ఔట్ పుట్ తనకు 10.45కు వచ్చిందని, వెంటనే దాన్ని తాను బాబాయ్‌కి ఫార్వర్డ్ చేశానని చెప్పాడు. 11.10కి బాబాయ్ నుంచి తనకు రిప్లయ్ వచ్చిందని… ‘టీజర్ అదిరిపోయింది… థియేటర్‌లో చూసేందుకు రెడీ అవుతున్నాను’ అని బాబాయ్ చెప్పారని చరణ్ తెలిపాడు.

- Advertisement -