బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌..

726
CM KCR
- Advertisement -

ముస్లిములు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది ఈదుల్‌. జుహ మనిషి త్యాగనిరతి గురించి తెలియజేసే పండుగ. అందుకే దీన్ని త్యాగాల పండుగని, ఈదుల్‌ అజహా, ఈదుజ్జహ లేక బక్రీద్‌ అని అంటారు. ఇక ముస్లింలు బుధవారం ఈదుల్ జొహా (బక్రీద్) పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగనిరతికి, భక్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. కష్టసుఖాలను పంచుకుని పేదల పట్ల దయార్ద హృదయంతో ఉండాలని పండుగ చాటిచెబుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.

CM KCR

ఓపిక, ఇతరుల పట్ల సహనం, తోటి వ్యక్తులను ఆదుకునే త్యాగానికి బక్రీద్ ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పేదల ఆకలి దప్పులను తీర్చడానికి త్యాగం చేయాలన్న సందేశం ఈ పండుగల్లో ఇమిడి ఉన్నదని తెలిపారు. మంచికి, మానవత్వానికి బక్రీద్ నిదర్శనంగా నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈదుల్ జొహా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎంమహమూద్ అలీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈద్గాలు, దర్గాల వద్ద తగిన ఏర్పాట్లుచేయాలని మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ వక్ఫ్ బోర్డు అధికారులు, పోలీసులను కోరారు.

- Advertisement -