ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు-పవన్‌

404

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్ని మేలుకొలిపేది, మానవులను మంచిగా బతకమని చెప్పేది రంజాన్ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు.‘విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్..ఇటువంటి గొప్ప సందేశాన్ని అందించే రంజాన్ మాసాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించే ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ నా తరపున, జనసైనిక్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు.

Pawan Kalyan

భారత దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ రంజాన్ పండగ స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు ఆచరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ రంజాన్ పండగ దేశ ప్రజలందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

ఇక వచ్చే సాధారణ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. ఇప్పటికే పవన్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఏపీలో పవన్ కీలకంగా మారడనున్నాడని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థుతుల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుందని తెలుస్తుంది.