రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది. దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభించారు ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సహకారంతో ఆకుపచ్చ గా ఉండాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన వారికి కృతజ్ఞతలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పచ్చదనం లేకపోతే చాలా కష్టం దుబాయ్ లాంటి దేశంలో పచ్చదనం కోసం చాలా కష్టపడతారు.సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో గడ్డి మొక్కలను కూడా చాలా అపురూపంగా పెంచుకుంటారు మనం దేశంలో మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది ఆ స్ఫూర్తిని మనకు కలిగిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
తాను ప్రకృతి ప్రేమికుడిని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉన్న వాడిని పచ్చదనాన్ని పెంచాలని గృహ ఉన్నవాడిని మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి, ఎన్టీవీ నరేంద్ర చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకోవాలని నా అభిమానులు అందరూ కూడా మొక్కలు నాటి పెంచాలని కోరుతున్నాను అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, సెక్రెటరీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు చలసాని దుర్గ ప్రసాద్, సెక్రటరీ సురేష్ రెడ్డి,సభ్యులు చలసాని శ్రీనివాస్, విద్యాసాగర్,బాలకృష్ణ, అట్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.