పవన్ మూవీ క్రేజీ అప్‌డేట్..!

229
kalyan

పవన్ కళ్యాణ్, రానా కాంబోలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా తాజాగా సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఫస్ట్ గ్లింప్స్‌, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అయితే ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని మేకర్స్ ప్రకటించిన వెంటనే ఈ టైటిల్ వైరల్ అయింది. రేపు విడుదల కానున్న టైటిల్ పోస్టర్ చూస్తే అసలు టైటిల్ ఏంటో తెలుస్తుంది.