కాటమరాయుడి సంక్రాంతి కానుక…

135
Pawan Sankranthi Treat

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శరవేగంగా తెరకెక్కుతున్న సినిమా కాటమరాయుడు. సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాటమరాయుడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దీపావళి, న్యూ ఇయర్ కానుకగా మోషన్ పోస్టర్‌లను విడుదల చేసి అభిమానులను అలరించిన చిత్ర బృందం…తాజాగా సంక్రాంతికి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘కాటమరాయుడు’ టీజర్‌ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. కిషోర్‌కుమార్‌ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌, అలీ, రావు రమేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Sankranthi Treat

ఇక ఇటీవల విడుదల చేసిన కాటమరాయుడి మేకింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఇందులో కాటమరాయుడి టీం సభ్యులంతా పవన్ అభిమానులకు..ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

New Year Wishes From Katamarayudu Team

Katamarayudu New Year Special | Pawan Kalyan | Shruthi Hassan