అదిరిన కాటమరాయుడి లుక్‌….

150
Katamarayudu New Year Special Poster

కిషోర్‌కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌ నటిస్తున్న చిత్రం కాటమరాయుడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈసినిమా టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా లుక్‌ని రిలీజ్‌చేశారు ఇందులో పవర్‌స్టార్‌ పంచెకట్టుతో మాస్‌ని ఆకర్షించేలా ఉన్న ఓ ఫోటోను అభిమానులతో చిత్ర యూనిట్‌ పంచుకుంది. కాటమరాయుడు సినిమా ఈ ఉగాదికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Katamarayudu New Year Special Poster

ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈసినిమాలో అలీ,రావు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకి అనూప్‌రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. తమిళంలో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అయ్యిన వీరమ్‌ సినిమాని రీమేక్‌గా కాటమరాయుడుని తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాలో పవన్‌కళ్యాన్‌ డిఫరెంట్‌ జోన్‌లలో కనబడనున్నాడు.