పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కథ మొత్తానికి సుఖాంతం అయింది. ఈ నెల మూడోవారంలో ఈ సినిమా లాంచ్ కాబోతుంది. ఇన్నాళ్లు కథ విషయంలో వచ్చిన డిస్కషన్లు అన్నీ పవన్ – హరీష్ సినిమాకు హర్డిల్స్ గా మారాయి. దాంతో హరీష్ శంకర్ కథలో అనేక మార్పులు చేర్పులు చేసి.. కథను ఫిక్స్ చేసుకోవడంలో బాగా ఆలస్యం అయింది. అయితే, తాజాగా కథకు లైన్ క్లియర్ అయింది. కాకపోతే.. కథలో మార్పులు వల్ల సినిమా కీలక కాస్ట్ అండ్ క్రూలో కూడా మార్పులు వచ్చాయి.
మొదట అనుకున్న సబ్జెక్ట్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో ఫుల్ యాక్షన్ టచ్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా యాడ్ చేశారు. అలాగే ఈ కథలో కూడా 8 ఫైట్లు వుంటాయి, అవన్నీ చాలా కీలకం. అలాగే సినిమాలో హిందీ నటుడు అనిల్ కపూర్ ను తీసుకునే ప్రయత్నం గట్టిగా చేసారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర లేదు. అలాగే మొదట అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉందట. ఆ హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించే అవకాశం ఉంది. పైగా ఆమె పాత్ర ఓన్లీ ప్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తోందట. తన సినిమాల్లో ఎప్పుడూ ఓ సీనియర్ హీరొయిన్ ను తీసుకుంటారు హరీష్ శంకర్. అలాగే ఈ సారి కూడా హీరోయిన్ ఖుష్బూని తీసుకునే ఛాన్స్ ఉందని రూమర్లు ఉన్నాయి. మొత్తం మీద ఫ్రెష్ గా స్టార్ట్ కాబోతోంది పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమా.
ఇవి కూడా చదవండి…